Home

BOOKS

Talpaka Annamacharyus Words


  • నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
    నగరాజధరుడ శ్రీ నారాయణా    
    నారాయణ శ్రీమన్నారాయణ
    నారాయణ వేంకట నారాయణ
    ॥నిగమా॥

    దీపించు వైరాగ్య దివ్యసౌఖ్యం బియ్య
    నోపక కదా నన్ను నొడబరుపుచు
    పైపైనె సంసార బంధముల కట్టేవు
    నా పలుకు చెల్లునా నారయణా    
    ॥నిగమ॥

    వివిద నిర్బంధముల వెడల ద్రోయక నన్ను
    భవ సాగరముల దడబడ జేతురా
    దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశ
    నవనీత చోర శ్రీనారాయణా    
    ॥నిగమ॥

                     - తాళ్ళపాక అన్నమాచార్యులు
            గానం - చిరంజీవి రాహుల్ వెల్లాల్

    श्री मार्तंड देवसंस्थान, जेजुरी.

Talpaka Annamacharyus Words


  • నెయ్యము లల్లోనేరేళ్ళో
    వొయ్యన నూరెడి యువ్విళ్ళో    
    ॥నెయ్యము॥

    పలుచని చెమటల బాహు మూలముల
    చెలమలలోనా చెలుపములే
    థళథళమను ముత్యపు చెఱగు సురటి
    దులిపేటి నీళ్ళ తుంపిళ్ళో    
    ॥నెయ్యము॥

    తొటతొట కన్నుల దొరిగేడి నీళ్ళ
    చిటి పొటి అలుకల చిరునగవే
    వటఫలంబు నీ వన్నెల మోవికి
    గుటుకలలోనా గుక్కిళ్ళో    
    ॥నెయ్యము॥

    గరగరికల వేంకటపతి కౌగిట
    పరిమళములలో బచ్చనలు
    మరునివింటి కమ్మనియంప విరుల
    గురితాకు లినుప గుగ్గిళ్ళో    
    ॥నెయ్యము॥

                     - తాళ్ళపాక అన్నమాచార్యులు
           గానం - యస్ పి బాలసుబ్రహ్మణ్యం
     

    erherh


Following items are strictly disallowed in and around the temple premises and can attract penal action in case of violations.